Thursday, September 23, 2010

"కామన్‌"వెల్త్ భాగోతం


అస్తవ్యస్థ వ్యవస్థ.... అసమర్థ నిర్వహణ.... అందినకాడికి దోపిడీ.....
వెరసి వందకోట్ల మంది పరువు మురికి కుంటలో మునక. కామన్‌వెల్త్ క్రీడల ఏర్పాట్లను చూస్తే ఇప్పుడు సామాన్యుని గుండె తరుక్కుపోతోంది. క్రీడలు మన ప్రతిష్టను పెంచుతాయని గప్పాలు కొట్టిన మన నేతలు....ప్రతిష్టను పెంచడం మాట అటుంచి ఉన్న ప్రతిష్టను న్యూఢిల్లీ వీధుల్లో వేలం వేస్తున్నారు. మన సన్నద్ధతను చూసి విదేశీయులు లోలోపల నవ్వుకుంటున్నారు. ఈ వెటకారపు నవ్వును సిగ్గు లేని రాజకీయ నాయకులు జీర్ణించుకోగలరేమో కానీ నిజమైన భారతీయుడు సహించలేడు. నిలువెల్లా అవినీతి, లంచగొండితనం జీర్ణించుకుపోయిన మన వృద్ధ రాజకీయ నాయకులకు మాత్రం ఇది చిన్న విషయంగా తోస్తోంది. వరుస ఘటనలు జరుగుతున్నా , స్టేడియాలు, నిర్మాణాలు పేకమేడల్లా కూలుతున్నా ఇవన్నీ కామన్ అంటూ చచ్చు వెధవలంతా స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నాకేయడమే అలవాటుగా మార్చుకున్న మన పాలకులకు ఇటువంటి ప్రతిష్టాత్మక విషయంలోనూ చేతి దురద ఆగకపోవడం మన వ్యవస్త దుస్థితిని కళ్లకు కడుతోంది. క్రీడల నిర్వహణకు ప్రారంభంలో కొట్టిన కొబ్బరికాయను 100 రూపాయలు పెట్టి కొన్న కామన్‌వెల్త్ క్రీడల అధికారులు ఇప్పటికీ అదే తీరున ప్రతీ వస్తువును కొనుగోలు చేస్తున్నారు. జనాల సొమ్మును ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసిన, మన భకాసురులు నాణ్యతను, నమ్మకాన్ని గాలికొదిలేశారు. ఫలితం గట్టిగా గాలివీస్తే కూలిపోయే స్టేడియాలు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు. స్టేడియాలు నెత్తిన పడతాయని భయపడ్డారేమో... కొందరు విదేశీ క్రీడాకారులు తట్టాబుట్టా సర్దుకుంటున్నారు. స్టేడియాలకు కూలిపోతాయేమోనని భయపడని మరికొందరు గట్టి గుండె క్రీడాకారులు దోమల దెబ్బకు జడుసుకుంటున్నారు. స్టేడియంలోకి బాంబులు తీసుకెళ్లినా పసిగట్టలేని మన పోలీసులు మాత్రం అది మీడియావాళ్ల అతి అంటూ ఆడలేక మద్దెల మీదకు తప్పును నెడుతున్నారు. మనవాళ్ల నిర్వాకాలు చూసి ఇప్పటికే అగ్రశ్రేణి క్రీడాకారులు కామన్వెల్త్స్ కు డుమ్మా కొట్టగా ఇప్పుడు ద్వితీయ శ్రేణి క్రీడాకారులు కూడా పారిపోవడానికి దారులు వెతుక్కుంటున్నారు. న్యూఢిల్లీ కామన్వెల్త్స్ లో ఆడాలో వద్దో క్రీడాకారులే నిర్ణయించుకోవాలంటూ ఇప్పటికే కొన్ని దేశాలు సరికొత్త పల్లవిని అందుకుంటున్నాయి. తాజాగా ఒలింపిక్స్ ను ఘనంగా నిర్వహించి శభాష్ అనిపించుకున్న చైనా లానే ఇండియా కూడా ఒలింపిక్స్ నిర్వహించగల సామర్థ్యం ఉన్నదని మొన్న ఎవరో ప్రముఖ వ్యక్తి చెప్పాడు. దయచేసి ఆ వ్యక్తి కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోతే మంచిదేమో. మనం ఒలింపిక్స్ ను నిర్వహించగలం.... ఎప్పుడంటే మన రాజకీయ నాయకులను, అవినీతి అధికారులను ఎర్రకోట దగ్గర వరుసగా నిలబెట్టి ఏ.కే.47 తో కాల్చి చంపినపుడు... లక్షల కోట్లు పోయాయి.....పరువు పోయింది....ప్రతిష్ట మంటకలిసింది... కడుపు మండిపోతోంది.

3 comments:

  1. కడుపు మండిపోతోంది

    ReplyDelete
  2. you are correct,
    మీ కడుపు మంట ఇంక రగిలించ టానికి

    http://www.guardian.co.uk/sport/gallery/2010/sep/23/commonwealth-games-delhi-athletes-village

    ReplyDelete