Thursday, February 18, 2010

జనం ఇంకా అజ్ఞానంలో లేరిక


జన విజ్ఞాన వేదిక....జనాలు అజ్ఞానంలో కూరుకుపోతున్నారని బోలెడంత ఆవేదన చెందుతూ కొంతమంది "అతి" తెలివి మేధావులు నెలకొల్పిన జ్ఞాన వేదిక...
ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఈ విజ్ఞాన వేదిక జనాలకు జ్ఞానాన్ని ప్రసాదించాల్సింది పోయి లేనిపోని తికమకలను , గందరగోళాన్ని ప్రసాదిస్తోంది. తాజాగా వచ్చిన సూర్య గ్రహణం నాడు పిచ్చి జనాలు క్రీస్తు పూర్వం నాటి మూఢనమ్మకాలతో భ్రష్టుపట్టిపోతున్నారని తెగ ఇదైపోయింది. ఈ ఇది లోంచే జనాలను ఎలాగైనా ఈ మూఢనమ్మకాల నుంచి బయపడేయాలనే దృఢనిశ్చయంతో షామియానాలు వేసి భారీగా కార్యక్రమాలూ చేసింది. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ "క్రీస్తు" శకంలో కూడా హిందువులు మూఢనమ్మకాలు పట్టుకుని వేలాడుతున్నారని... వారిని మార్చడం వారి దేవుడి వల్ల కూడా కాదని ఒక స్టేట్‌మెంట్‌ని కూడా ఈ షామియానా కార్యక్రమంలో బాగానే వినిపించింది. వారనుకుంటున్న కొత్త తరహా " క్రీస్తు" శకంలోకి హిందువులను తీసుకువెళ్లేందకు... పలువురికి ఆరుబయట భోజనాలు ఏర్పాటు చేసింది. కొంత మంది గర్భిణులను తీసుకువచ్చి వారి చేత కూడా తిండి తినిపించి... కొద్ది సేపు గంతులు వేయించి ఏమి కాలేదు చూశారా అంటూ మీడియాకు ఫోజులు ఇప్పించింది. శభాష్ జనవిజ్జాన వేదికా...జనాలలో కొత్త చైతన్యాన్ని తీసుకువస్తూ.... హిందువుల అజ్ఞానాన్ని తొలగించి వారిని బాగు చేసేందుకు.. ఇంకా క్రీస్తు పూర్వంలోనే ఉన్నవారిని" క్రీస్తు" శకంలోకి తీసుకురావాలని మీరు చేస్తున్న ప్రయత్నానికి నిజంగా హేట్సాఫ్.... అయితే ఈ హేట్సాఫ్ దక్కాలంటే జన విజ్ఞాన వేదిక సభ్యులూ మీరు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రపంచానికి విజ్ఞానాన్ని నేర్పిన వారికి... పురాతన కాలం వేదాల నుంచి ఇప్పటి యోగా వరకు " వీరి సంస్కృతిలో, వీరి వ్యవహారాల్లో ఏదో గమ్మత్తుందబ్బా " అంటూ సొల్లు కార్చుకుంటున్న ఇంగ్లీష్ వాడికి కూడా మీరు కళ్లు తెరిపించండి సార్. అయితే పొద్దస్తమానం హిందువుల ఆచార వ్యవహారాలు, వారి మూఢనమ్మకాల గురించే ఆలోచించి , కార్యక్రమాలు చేసి మీరు హిందూ పక్షపాతులుగా మారిపోతున్నారని లోకల్ టాక్.. సో హిందువుల మూఢనమ్మకాలను...వాటి నుంచి ఆ అజ్ఞాన జనాన్ని చైతన్యం చేసే కార్యక్రమాన్ని కాస్త పక్కన పెట్టి .... ఇతర మతాల్లో ఉన్న మూఢనమ్మకాల గురించి కూడా జనాల్లో చైతన్యం కలిగిస్తే బాగుంటుందేమో సార్... ఎందుకంటే మీది జన విజ్ఞాన వేదిక కదా? జనాలు అంటే అన్ని మతాలు వారు అన్ని వర్గాలు వారు ఈ మందలోకి వస్తారు కదా? మీరు హిందూ విజ్ఞాన వేదికగా మారిపోకుండా .. జన విజ్ఞాన వేదికగానే ఉండాలంటే మీరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి సార్...

1. నిరంతరం హిందువుల మూఢనమ్మకాలపై "అలుపెరుగని" పోరాటం చేసే మీరు ఇతర మతాల వారు అవలంభిస్తున్న మూఢ నమ్మకాలపై ఎందుకు నోరు మొదపరు?

2. నీళ్లు జల్లినంతనే సైతాను పారిపోతాడని జనాలను నమ్మిస్తున్న క్రైస్తవ తండ్రులనుమీరు ప్రశ్నించగలరా...ఇది మూఢనమ్మకమని? ఇటువంటి ప్రార్థనలు జరుగుతున్నప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? ఆఫ్ఘనిస్తాన్ లో లాడెన్ ను వెతికేందుకు అమెరికా వాడికి సాయపడేందుకు వెళుతుంటారా?

3.రక్తం కారేటట్టు శరీరాన్ని గాయం పర్చుకుని త్యాగం గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు ప్రయత్నిస్తున్న మన ముస్లిం సోదరులను....వద్దు ఇది మూఢనమ్మకం అని చెప్పగలిగే దమ్ము, గుండె ధైర్యం మీకున్నాయా?

4.సూర్య గ్రహణం రోజు మీరు పెట్టిన భోజన కార్యక్రమంలో పాల్గొన్న వారు వర్గానికి చెందిన వారో మీరు బహిరంగ పరచాలి?

సహనానికి, శీలానికి సరికొత్త నిర్వచనం చెప్పిన హిందూ మతాన్ని కించపరిచేందుకు ప్రయత్నించిన వారు చరిత్రలో కలిసిపోయారు. హిందూ ధర్మం మాత్రం మండుతున్న అగ్నిలా స్వచ్ఛతను వెదజల్లుతూ తన పవిత్రతను కాపాడుకుంటూ వస్తోంది. ప్రతీ మతం లోనూ కొన్ని నమ్మకాలు ఉంటాయి. జనాలకు చెడు చేయనంత వరకు ఏ నమ్మకంతోనూ ఎవరికి ఇబ్బందులు లేవు. ఒకరి నమ్మకాన్ని దెబ్బతీసే అధికారం మీకు ఎవరిచ్చారు? సహనశీలుర సహనానికి ఓ హద్దంటూ ఉంటుంది. ఆ హద్దును వారు దాటారా..... బురదను వెదజల్లే పనికి మాలిన "అజ్ఞాన" గేదెలకు ఈ సమాజంలో చోటు లేకుండా పోతుంది.

No comments:

Post a Comment