
ఎందరిలోనో స్ఫూర్తిని నింపిన మైఖేల్....
నీవు మా మధ్య లేకున్నా నీ పాటుంది , నీ ఆటుంది
ఉరకలెత్తే ఉత్తేజాన్ని అణువణువునా నింపుకున్న నల్లజాతి వజ్రమా
పీడిత వర్గాల వారూ అద్భుతాలు చేయగలరని నిరూపించి శ్వేతజాతి దురహంకారం పై నర్తించిన అపర నటరాజువు నువ్వు ..........
నిన్ను అర్ధం చేసుకోని ఈ ప్రపంచాన్ని వదిలి
కల్మషం లేని చిన్నపిల్లల లోకం లోకి వెళ్ళిపోయి ...
మాకూ మర్చిపోలేని ' థ్రిల్లర్ 'ని మిగిల్చావా.
నీలాంటి మెరుపు వేగాన్ని ,
ఎవ్వరూ 'బీటిట్' చేయలేని నీ డాన్స్ ను మేము ఎప్పటికైనా చూడగలమా ?
చూడలేము!
ఎందుకంటే దేవుడు కొన్నింటిని కేవలం ఒక్కటి మాత్రమే సృష్టిస్తాడు
మైఖేల్ లాంటి ఆణిముత్యాల్ని .........
MICHAEL WE MISS YOU A LOT
No comments:
Post a Comment