
పల్లె....
ఎంత గొప్పది నా పల్లె....
అమ్మ ప్రేమకే కన్ను కుట్టించే నా ప్రేమల తల్లి...
అమాయకత్వం...అప్యాయతలే నా తల్లికి సింగారాలు....
రెడీమెడ్ పెట్టుడు నవ్వులు లోకంలో .....
పసిపాపలాంటి స్వచ్ఛమైన నవ్వు నా తల్లిది...
పాలనురుగుల లేగదూడలు, ధాన్యరాశుల సిరులు కుప్పలు...
ఆహా ఏమి నా తల్లి వైభోగం ....
అయినా ఇది గతం....నా తల్లి సిరులు కరిగిపోయాయి...
కలం దొడ్డి మూగపోయింది...కులం బిడ్డలు వలసలెళ్లారు...
బీడు పట్టిన కటిక నేల, నా తల్లిని చూసి నవ్వుతోంది....
లేగదూడని పట్టుకొని ఏడుద్దామంటే దాని పెళ్లి కళేబాతో ఎప్పుడో జరిగిపోయింది...
పెద్ద పండక్కి ప్లాస్టిక్ నవ్వులతో వచ్చే నా అన్నలు నాతల్లిని ఏ కారాగార కసాయికో అమ్మేందుకు చేసే మంతనాలు...
ఆ గొడ్ల సావిడలేమయ్యాయి? ఆ ధాన్య రాశులేమయ్యాయి.
ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియని నా తల్లి బక్కచిక్కిపోతోంది...బిక్కచచ్చిపోతోంది...
అద్బుత౦ గా ఉ౦ది......
ReplyDeleteకవితకి ఆ పోటో చాలా కళ తెచ్చి౦ది..
నేను మొదటిసారి వచ్చాను మీ బ్లాగ్ కి చూస్తే చాలా పోస్ట్ లే ఉన్నాయి..
నేను రెగ్యులర్ గా చూస్తానే కూడలి ఎలా మిస్స్ కోట్టానబ్బ?????
పల్లె జనం ఆప్యాయతలు..
ReplyDeleteమనస్ఫూర్తి పలకరింతలు..
అన్నీ ఇప్పుడు కలుషితమవుతున్నాయి.
మనీ బంధం మనసు చుట్టూ అల్లుకుని పోతోంది.
పట్నంలోని అపార్టుమెంటు బతుకు
మనుషులను మరమనుషులను చేస్తోంది.
ఎప్పుడో..
కంటిముందు కమ్మిన కన్నీటి తెరపై
ఆ ఙాపకాలు కనిపిస్తాయి.
వెనక్కి వెళ్లలేని, ఆ పల్లెకు
ఏమీ చేయలేని అసహాయత
కాళ్లకు బంధమేస్తుంది.
అయినా..
కన్న ఊరు మనకెప్పుడూ గొప్పదే!
మెట్టినింటి కన్నా పుట్టిల్లు అందరికీ ఇష్టమే కదా!!
వెంకట్ గారు నాకు వెంటనే మావూరు వెళ్ళీపోవాలని వుండీ.
ReplyDelete