Wednesday, July 28, 2010

నేను


నేను .......
తరచి చూస్తే స్వార్థానికి ప్రతీకల్లా లేవూ ఈ రెండక్షరాలూ!
కానీ నేను స్వార్థపరుడ్నే అని ఒప్పుకునేందుకు ఎందుకో అహం అడ్డొస్తోంది!
ఏమో.... ఎందుకో...నాకే తెలియదు...
అవును నేను నిజంగా స్వార్థపరుడ్నేనా?
జనాన్ని తోసుకుంటూ బస్సు ఎక్కేస్తాను....సీటు సంపాదించేస్తాను...
సంతృప్తితో కునుకు తీస్తాను,బస్సులో ఎంతోమంది నిలబడలేక ఇబ్బందులు పడుతున్నా!
ఇదేనా స్వార్ధం అంటే...
కానీ "నేను" ఎంతో కష్టపడి సీటు సంపాదించుకున్నాను కదా?
అదుగో మళ్లీ "నేను"!
నా "మనస్సాక్షి"కి ఆ "నేను"కి నిరంతం జరిగే ఈ సంఘర్షణ ఎన్నటికి ముగిసెనో!

No comments:

Post a Comment