Friday, July 30, 2010

ఏందిరా మీ గోల!


ఒకరు గనులంటారు
మరొకరు మణులంటారు
ఒకడు మీరు దొంగలంటాడు
మరొకడు మీరే గజదొంగలంటాడు
వాడేమో మీ పాలనలో జనానికి మిగిలింగి కన్నీళ్లే అంటాడు
వీడేమో ఆపండి మీ మొసలి కన్నీళ్లు అంటాడు
అసలు ఇంతకీ ఎవరు దొంగలు?ఎవరు దొరలు?
ఎవరు మహానుభావులు?ఎవరు దద్దమ్మలు?
సిబీఐ ఎంక్వయిరీ వేసి మీ ఇద్దరిలో ఎవరు వాజమ్మలో తేలుద్దామంటారా?
మీడియా ముసుగులో గుద్దుకుంటున్న మీ ఇద్దరిలో ఏవరు దొంగలో ఎవరు దొరలో దేవుడికెరుక కానీ....
మీ పేపర్లు చదువుతూ మీ ఛానెళ్లు చూస్తున్న తెలుగు ప్రజల సహనానికి ఈ బక్కోడు బోర్లాపడి మొక్కుతున్నాడు....

(సొంత జెండా, ఎజెండాల వార్తలతో నిండిపోయే ఈ దగుల్బాజీ పేపర్లను నేనైతే చదవడం మానుకున్నాను)

2 comments: