Thursday, December 24, 2009

నవ్వుతూ విడిపోదాం తమ్ముడు...



బ్రతకడానికొచ్చిన వారు, వలసవాదులు, ఆంధ్రోళ్లు....
ఏమిటీ మాటలు....
ఈ మాటలను కుళ్లు రాజకీయనాయకులను, తెలంగాణా ద్రోహులను ఉద్దేశించి మీరు వాడితే మేము స్వాగతిస్తాం....
మీ న్యాయపూరిత ఉద్యమాన్ని గౌరవిస్తాం....
కానీ మీ అన్నదమ్ములం, మీ తోటి విద్యార్థులం,
మీ సహచరలమైన మన యువతను ఉద్దేశించి ఈ పదాలను వాడితే మీ ఉద్యమ ఉద్దేశ్యం దెబ్బతింటుంది.
మాలో సరికొత్త ఉద్యమం రూపుదాలుస్తుంది.
కరీంనగర్, వరంగల్, మంచిర్యాలల నుంచి మీరెలా హైదరాబాద్ కు వచ్చారో....
మేము అలాగే వైజాగ్, విజయవాడ,రాజమండ్రిల నుంచి వచ్చాము.
మేము ఎలా బ్రతుకుతెరువు కోసం వచ్చామో మీరు అలాగే బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ కు వచ్చారు.
మా సొంత రాష్ట్ర రాజధాని నగరానికి రావడమే మా తప్పా...
మేమేమీ పాకిస్థాన్ వాళ్లంకాదు కదా...
ఇన్నాళ్లూ కలిసిమెలిసి ఉన్నాం....
విడిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు కూడా నవ్వుతూ విడిపోదాం...
తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలియని వాళ్లకు తెలంగాణ 50 ఏళ్ల పోరాటం కోసం చెప్పండి......
నీటిలో ,నిధుల్లో తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాన్ని మీ ఆంధ్రా సోదరులకు తెలియజేయండి...
మీ న్యాయమైన పోరాటానికి మద్ధతివ్వమని అడగండి....
అంతేకానీ నీచరాజకీయ నాయకుల మాటలను 'వల్లె ' వేయకండి....
విద్యార్థులు , యువత మాత్రమే ఉద్యమాలను నిర్మించగలదన్న సత్యాన్ని మీరు మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు....
మీ శ్రమను రాజకీయ నాయకులకు ధారాదత్తం చేయకండి...
50 ఏళ్ల దోపిడీ కోసం పోరాడుతున్న మీరు 'శ్రమ' దోపిడీకి గురికాకండి.....

2 comments:

  1. Tammudu ne uddeshyam naku nachindi
    very goood
    from the begining am supporting u
    as a telanganite till today i never hurted any non telanganite
    because what ever happens in future... it may not effect our relation

    Jai telangana.. Jai Andhra... Jai Greater Rayalaseema...

    ReplyDelete
  2. చాలా ఆలోచనాత్మక౦గా ఉ౦ది..బాగా రాశారు..
    కొ౦చ౦ వర్డ్ వెరెఫికెషన్ తీస్తే కామె౦ట్ రాయడానికి సౌలభ్య౦గా ఉ౦టు౦ది..కామె౦ట్ రాదామ౦టే ఆ ఎ౦దుకు లే అని జన౦ వెళ్ళి పోతారు..కామె౦ట్స్ తో మ౦చి ఎనర్జీ వస్తూ౦ది.

    ReplyDelete